kobbari matta-కొబ్బరిమట్ట Movie dialogue

రేయ్.... కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి,ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే,పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో, ఎలాగోలా పుట్టేసి పెరిగేసి,ఎదిగేస్తున్న టైం లో

తను పుట్టింది తన కోసం కాదు ఎక్కడో పుట్టిన ఎదవ కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి పావు కిలో లడ్డూలు,అరకిలో చేకోడీలు పెట్టి దున్న పోతులాంటి ఒక పెళ్ళికొడుకుని తీసుకు వచ్చి

తల దించుకుని పెళ్ళిలో,కళ్ళు దించుకుని శోభనం గదిలో పడుకుంటే గుండెల మీద తాళి బరువు ,శరీరంమీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్నితొమ్మిది నెలలు మోసి మోసి

ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చి,ప్రతి రోజు కోడి కంటే ముందు నిద్ర లేచి నుదుటున బొట్టు పెట్టి,వాకిట్లో ముగ్గు పెట్టి,స్టవ్ మీద గిన్ని పెట్టి,అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి,టీ పొడి కలిపి పెట్టి,

పిల్లల నోటికి తిండి పెట్టి,వాళ్ళను బడికి వెళ్ళగొట్టి,నిన్ను ఆఫీస్ కి తరిమి కొట్టి ఒక చేత రిమోట్,ఒక చేత కత్తిపీట పట్టుకొని,చానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి తరిగి

,11 గంటలకు మా వూరి వంట,12 గంటలకు స్టార్ మహిళ చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూరేక్కడ మాడి పోతుందన్న టెన్షన్ లో బ్రేక్ మద్యలో అత్త గారికి  అన్నం పెట్టి,

ముద్దమందారం ఆడదే ఆదారం,మనసు మమత ,గోకులంలో సీత,స్వాతి చినుకులు అంటూ పగలు రాత్రి తేడాలేకుండా సీరియల్ లో సమస్యలను తన సమస్యలు గా భా వించి

బరువెక్కిన గుండెతో అలిసోచ్చిన భర్తకి గుప్పిడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుంది రా అది రా ఆడదంటే ...........అలంటి భార్యను వదిలేస్తానంటావా Bloody fool

Share this

Related Posts

Previous
Next Post »