Tholiprema-గగనానికి ఉదయం ఒకటే


గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే

ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలో కలిశాం మనమే మనమే
జన్మించలేదా నీవు నాకోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
ప్రేమ ...ప్రేమ...ప్రేమ...ప్రేమ ...

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే

నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరని
నీ గుండెల్లో తిరిగేలయనే బదులు పలకని
నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై
కదిలించ లేదా నేనే మేలు కొలుపై
గత జ్ఞాపకాన్ని నిన్ను పిలవ
కరగాల మంచు పొరలో ఉండగలనా

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే

నా ఊహల్లో కదిలే కలలే ఎదుట పడినవి
నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవి
సమయాన్ని శాశ్వతంగా నిలచిపోనీ
మమతన్న అమృతంలో ముంగిపోనీ
మనవైన ఈ క్షణాలే అక్షరాలై
మృతిలేని ప్రేమ కథగా మిగిలిపొనీ

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే

ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలో కలిశాం మనమే మనమే
జన్మించలేదా నీవు నాకోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
ప్రేమ ...ప్రేమ...ప్రేమ...ప్రేమ ...

Share this

Related Posts

Previous
Next Post »